Viral Video: సారీ.. క్షమించండి.. అని వేడుకున్నా.. స్టేషన్‌లో కానిస్టేబుల్‌ను చితక్కొట్టిన జనం.. ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానమే లేదు

ABN , First Publish Date - 2022-08-07T00:18:27+05:30 IST

ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారనే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్‌లను రక్షక భట నిలయాలు అంటారు. అయితే.. సాధారణ ప్రజలకు రక్షణ కల్పించటమేమో కానీ.. అక్కడ పోలీసులకే భద్రత కరువైంది. అందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ

Viral Video: సారీ.. క్షమించండి.. అని వేడుకున్నా.. స్టేషన్‌లో కానిస్టేబుల్‌ను చితక్కొట్టిన జనం.. ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానమే లేదు

ఇంటర్నెట్ డెస్క్: ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారనే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్‌లను రక్షక భట నిలయాలు అంటారు. అయితే.. సాధారణ ప్రజలకు రక్షణ కల్పించటమేమో కానీ.. అక్కడ పోలీసులకే భద్రత కరువైంది. అందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..



ఢిల్లీ(Delhi)లోని ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌‌(Anand Vihar police station)లోకి సుమారు 10-12 మంది వ్యక్తులు ఎంటర్ అయ్యారు. సరాసరి స్టేషన్‌లో కూర్చుని ఉన్న హెడ్ కానిస్టేబుల్( head constable) దగ్గరకు చేరుకున్నారు. అనంతరం ఆ అధికారిని చుట్టుముట్టారు. అనంతరం అధికారిని దూషిస్తూ ఓ వ్యక్తి చేయి చేసుకోగా.. మిగిలిన వాళ్లు ఆ దృశ్యాలను వీడియో తీశారు. క్షమించండి అని వేడుకుంటున్నా.. సదరు వ్యక్తి ఆ అధికారిపై దాడి చేశాడు. ఆ సమయంలో స్టేషన్‌లో ఇతర పోలీసులు ఉన్నా.. ఆ అల్లరిమూక(Mob)ను ఆపలేకపోయారు. పైగా పోలీసులు కూడా ఆ దృశ్యాలను వీడియో(video) తీశారు. ఈ ఘటన ఆగస్టు 3న చోటు చేసుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌(viral)గా మారింది. అయితే.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వాళ్లు ఎవరు? స్టేషన్‌కు వచ్చి మరీ అధికారిపై దాడి ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. ఉన్నతాధికారులు మాత్రం.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.




Updated Date - 2022-08-07T00:18:27+05:30 IST