సీనియర్ సిటిజన్లకు బూస్టర్.. కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-20T20:29:00+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢిల్లీ..

సీనియర్ సిటిజన్లకు బూస్టర్.. కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. బూస్టర్ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఇవి ఏ తరహా కోవిడ్ కోసులనేవి నిర్దారించే ప్రయత్నం జరుగుతోందని, నార్మల్ కేసులా ఒమైక్రాన్ కేసులా అనేది నిర్దారించేందుకు పాజిటివ్ కేసులకు సంబంధించిన శాంపుల్స్‌ను జెనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నట్టు చెప్పారు.


ప్రజలు ఎవరూ భయందోళన చెందవద్దని, ఒమైక్రాన్ విస్తరించిన పక్షంలో సమర్ధవంతంగా ఎదర్కొనేందుకు ఆసుపత్రుల్లో తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు. అన్ని కేసుల విషయంలోనూ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని, హోం ఐసొలేషన్‌ను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రెండు డోసులు వేయించుకున్న సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్‌ తీసుకునేందుకు కేంద్రం అనుమతించాలని కోరారు. కాగా, సోమవారంనాడు మరో రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడటంతో ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య 24కు చేరింది.

Updated Date - 2021-12-20T20:29:00+05:30 IST