న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానానికి పిడుగుపాటు భయంతో దారి మళ్లించారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కారణంగా ఢిల్లీకి రావాల్సిన విస్తారా విమానాన్ని లక్నోకు మళ్లించారు.యూకే 940నంబరు గల విస్తారా విమానం ముంబై నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి రాత్రి 9.55 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా, పిడుగుపాటు కారణంగా లక్నో విమానాశ్రయానికి మళ్లించామని అధికారులు వివరించారు.ఢిల్లీ విమానాశ్రయంపై పిడుగుపాటు కారణంగా ముంబై నుంచి విస్తారా విమానం సోమవారం సాయంత్రం లక్నో విమానాశ్రయానికి మళ్లించామని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి