న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రతి చదరపు కిలోమీటరుకు సీసీటీవీ కవరేజీలో ఢిల్లీ నంబర్ వన్ నగరంగా నిలిచిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీవ్యాప్తంగా 2,75,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి అరవింద్ అన్నారు. వీధులు, రహదారులు, కాలనీలు, ఆర్ డ్ల్యూ ఎస్, పాఠశాలలు మరియు ఇతర ప్రదేశాలలో వీటిని అమర్చారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఒక చదరపు కిలోమీటరుకు అత్యధికంగా సీసీటీ కెమెరాలను కలిగి ఉన్న నగరం ఢిల్లీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని నార్వే సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వ నిర్వహించబడిందని సంస్థ తెలిపింది.