Delhi Assembly: ఎమ్మెల్యేలు, మంత్రులకు 66 శాతం జీతం పెంపు బిల్లు ఆమోదం

ABN , First Publish Date - 2022-07-04T22:28:26+05:30 IST

ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతం, అలవెన్స్‌లు 66 శాతం పెంచుతూ రూపొందించిన బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీ సోమవారంనాడు..

Delhi Assembly: ఎమ్మెల్యేలు, మంత్రులకు 66 శాతం జీతం పెంపు బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతం, అలవెన్స్‌లు 66 శాతం పెంచుతూ రూపొందించిన బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీ సోమవారంనాడు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐదు వేర్వేరు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్, స్పీకర్-డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో విపక్ష నేత జీతాల పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులకు సభామోదం లభించింది.


పెరుగుతున్న ధరలు, శాసససభ్యుల పనికి అనుగుణంగా వేతనాలు ఉండాలని సభ్యులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, రాజకీయాల్లోకి ప్రతిభావంతులను ఆహ్వానించాలంటే రివార్డులు ఉండాలని అన్నారు. కార్పొరేట్లు సైతం ఆకర్షణీయమైన జీతాలతో ప్రతిభావంతులను తీసుకుంటారని చెప్పారు. కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులకు జీతాల పెంపును బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆ పార్టీ విపక్ష నేత రామ్‌వీర్ సింగ్ బిధూరి సమర్ధించారు.

Updated Date - 2022-07-04T22:28:26+05:30 IST