డిలీటెడ్‌ మెసేజ్‌ మళ్ళీ వెనక్కు

ABN , First Publish Date - 2022-07-02T08:59:03+05:30 IST

వాట్సప్‌లో పొరపాటో, తొందరపాటునో ఒక్కోసారి అవసరమైన మెసేజ్‌లను కూడా డిలీట్‌ చేస్తుంటాం.

డిలీటెడ్‌ మెసేజ్‌ మళ్ళీ వెనక్కు

వాట్సప్‌లో పొరపాటో, తొందరపాటునో ఒక్కోసారి అవసరమైన మెసేజ్‌లను కూడా డిలీట్‌ చేస్తుంటాం. నిజానికి 2017లోనే ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్విర్‌వన్‌’ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకువచ్చింది. అయితే పొరపాటును అవసరమైన మెసేజ్‌లు డిలీట్‌ అయితే, తిరిగి పొందడానికి ఒక ఆప్షన్‌ ఉంది. అదెలాగంటే

ముందు డివైస్‌ నుంచి వాట్సాప్‌ను డిలీట్‌ చేయాలి.

గూగుల్‌ ప్లే లేదంటే యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి నేరుగా మళ్ళీ వాట్సాప్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

దాన్ని ఓపెన్‌ చేసిన తదుపరి, బ్యాకప్‌ నుంచి చాట్స్‌ను రెస్టోర్‌ చేయాలా అని అడుగుతుంది. 

‘ఎస్‌’ని టాప్‌ చేసి అవి రికవర్‌ అయ్యేవరకు ఆగాలి. అప్పుడు డిలీట్‌  అయిన మెసేజ్‌లూ కనిపిస్తాయి. 

రిసీవర్‌ ఈ మెసేజ్‌ చూస్తాడన్న ఆందోళన వద్దు. మీకు ఆ ఇన్ఫో దక్కింది, అంతే.

Updated Date - 2022-07-02T08:59:03+05:30 IST