Abn logo
May 17 2021 @ 00:11AM

అనుమతులు రావడమే ఆలస్యం..

వల్లంపల్లి శివారులో స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీలు (ఫైల్‌)

- కలెక్టరేట్‌, ఎస్పీ సొంత భవన సముదాయాలకు సన్నాహాలు

- కౌరంపల్లి, వల్లంపల్లి శివారుల్లో 43 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు

- ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన జిల్లా అధికార యంత్రాంగం 

- నిర్మాణానికి రూ.55 కోట్ల మంజూరుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 

నారాయణపేట, మే 16: నారాయణపేట జిల్లా మూడో వసంతంలో అడుగిడింది. కొత్త జిల్లా ఏర్ప డ్డాక కలెక్టరేట్‌లో పోస్టులు కూడా మంజూరి లేక ఇన్‌చార్జీల పాలనతో ఎదురౌతున్న ఇబ్బం దులతో పాటు అద్దె భవనాల్లో కార్యాలయాలు కొనసాగు తున్న అంశాన్ని గత అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి తన వాణిని వినిపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల సొంత భవ నాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చే యగారూ.55 కోట్ల మంజూరుకు సీఎం గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌కు 53 పోస్టు లను కూడా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ఉ త్తర్వులను గత మార్చి 26న జారీ చేసింది. కాగా జిల్లా కలెక్టరేట్‌ ప్రస్తుతం అద్దె భవనంలో కొన సాగుతుండగా కలెక్టరేట్‌ సొంతభవనం కోసం నారాయణపేట కౌరంపల్లి శివారులోని సర్వేనం బర్‌ 31లో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తిం చారు. అలాగే ఎస్పీ కార్యాలయం పాత పోలీస్‌ స్టేషన్‌లో కొనసాగుతుండగా ఎస్పీ కార్యాలయ సొంత భవనం కోసం వల్లంపల్లి శివారులోని సర్వే నంబర్‌ 67లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఈ రెండు సర్వే నంబర్ల ప్రభుత్వ భూములను ఇటీవల జిల్లా కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, సర్వేయర్‌ మల్లేశంలు పరిశీలించారు. ఈ ప్రభుత్వ భూము లకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికలను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ ద్వారా పంపించారు. భవన నిర్మాణాల విషయాని కొస్తే ఒకే భవన సముదాయంలో సమీకృతంగా ఏర్పాటుచేస్తే ఈ భవనాలు పూర్తైతే పరిపాలన కేంద్రీకృతమై ప్రజ లకు అన్నీ ప్రభుత్వ కార్యాలయాల సేవలు ఒకేచో ట అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. మోడల్‌ భవనంగా కలెక్టరేట్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణానికి 23 ఎకరాల స్థలం అవసరం, ఎస్పీ కా ర్యాలయానికి 20 ఎకరాల ప్రభుత్వ స్థలం అవస రమున్నట్లు అధికారులు గుర్తించి అందుకనుగు ణంగా నివేదికలను కూడా పంపించారు. ప్రభు త్వం నుంచి అనుమతులు రావడమే ఆలస్యం. ఎమ్మెల్యే కృషితోనే జిల్లా ఏర్పాటుతో పాటు సొంత భవనా లు నిర్మాణానికి మార్గం సుగుమమైందని టీఆర్‌ ఎస్‌ శ్రేణులు చెప్పుకుంటున్నారు. 

Advertisement