పనుల్లో జాప్యం..విద్యార్థులకు శాపం!

ABN , First Publish Date - 2021-02-26T04:00:01+05:30 IST

డుగు వేయలేని స్థితిలో మారింది. ‘నాడు-నేడు’ పనుల్లో జాప్యమే ఇందుకు కారణం. ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతుండగా..వరండాల్లో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా పాఠశాలలో చదువుతున్న 900 మంది విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారు.

పనుల్లో జాప్యం..విద్యార్థులకు శాపం!
అస్తవ్యస్తంగా గొప్పిలి పాఠశాల ప్రాంగణం


 అసంపూర్తిగా నిర్మాణాలు

 విద్యాబోధనకు ఇబ్బందులు

(టెక్కలి రూరల్‌/ మెళియాపుట్టి)

-మెళియాపుట్టి మండలం గొప్పిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణమిది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో మారింది. ‘నాడు-నేడు’ పనుల్లో జాప్యమే ఇందుకు కారణం. ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతుండగా..వరండాల్లో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా పాఠశాలలో చదువుతున్న 900 మంది విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారు. 

-టెక్కలి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తరగతి గది దుస్థితి ఇది. ఒకవైపు మరమ్మతు పనులు జరుగుతుండగా..విద్యార్థులకు బోధన సాగుతోంది. పాఠశాలలో మౌలిక వసతులు, ఆధునికీకరణ పనులకు నాబార్డు నిధులు మంజూరు చేసింది. కానీ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇలా పాఠశాలల్లో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొవిడ్‌ పుణ్యమా అని ఈ ఏడాది తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వీలై నంత త్వరగా సిలబస్‌ పూర్తిచేయాలన్న తలంపులో ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఈ అసంపూర్తి పను లు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. బిల్లుల చెల్లింపులు లేక పనులు నిలిపివేస్తున్నట్టు నిర్వాహ కులు చెబుతుండగా...నిధుల కొరత లేదని ప్రభు త్వం చెప్పుకొస్తోంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరముంది.


టెక్కలి బాలికోన్నత పాఠశాలలో..

టెక్కలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 640 మంది విద్యా ర్థినులు చదువుతున్నారు. వసతి సమస్య ఉండడంతో అదనపు భవనా లు, మౌలిక వసతులకల్పనకు ఏడు నెలల కిందట నాబార్డు నిధులు రూ.1.71 కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభించారు. పాత భవనాలు తొలగించారు. కొన్నింటికీ మరమ్మ తులు చేయనున్నారు. అయితే పనుల్లో ఆశించిన స్థాయి లో పురోగతి లేదు. కొద్ది పనులు చేసి నిలిపివేశారు. దీంతో విద్యార్థినులకు, అటు ఉపాధ్యా యులకు ఇబ్బందులు తప్పడం లేదు. అసంపూర్తి నిర్మాణా ల నడుమ తరగతి గదుల్లో  బోధన సాగుతుండడంతో అసౌకర్యానికి గురవు తున్నారు. వసతిగృహ సదుపాయం లేకపోవడంతో హాజరుశాతం తగ్గిపోతోంది. విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. మధ్యాహ్న వంటలకు సంబంధించి వంట గదులు లేకపోవడంతో ఆరుబయట, చెట్ల కింద వంటలు చేయాల్సిన పరిస్థితి. పనుల్లో జాప్యంపై ఏపీఈడబ్ల్యూఐడీసీ ఏఈ రాజేంద్ర వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. పనులపై ప్రత్యేకంగా దృష్టిసారించామని..మేనాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 


గొప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో..

గొప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండో విడత ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా పాఠశాలలో నూతన  భవనా లు, మౌలిక వసతులకల్పనకు నిధులు మంజూరయ్యాయి. పను ల బాధ్యతను చూడాల్సిన సంస్థ ముందుకు రాలేదు. దీంతో తల్లిదండ్రుల కమిటీయే పనులు చేయించడానికి ముందుకొచ్చింది. కానీ బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు అసంపూర్తిగా నిలిచి పోయింది. దీంతో భవన నిర్మాణ సామగ్రితో పాఠశాల ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. చివరకు ఉపాధ్యాయులు తమ జీతంలో రూ.5 వేల వంతున పోగుచేసి కొంతవరకూ పను లు చేయించారు. బిల్లులు వచ్చిన తరువాత జీతం చెల్లించేలా కమిటీతో ఒప్పందం చేసుకు న్నారు. చాలావరకూ పనులు పెండింగ్‌లో ఉండంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ పాఠశాలలోనే జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య వెళ్లినా పరిష్కారం కాలేదు.  ఒక్క గొప్పిలలోనే కాదు...మండలంలో 36 పాఠశాలల్లో ఇదే దుస్థితి. రూ.9.60 కోట్లు అంచనా వేయగా ఇందులో రూ.8 కోట్ల వరకు మంజూరైనా పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో జాప్యంపై ఎంఈవో దేవేంద్రరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా గడువులోగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.




Updated Date - 2021-02-26T04:00:01+05:30 IST