మొక్కజొన్న కొనుగోలులో జాప్యం

ABN , First Publish Date - 2021-05-16T06:03:20+05:30 IST

మద్దతు ధరతో రైతుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని గొప్పలు పోతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో రైతుకు మొండిచేయి చూపుతోంది.

మొక్కజొన్న కొనుగోలులో జాప్యం
వర్షానికి తడుస్తున్న మొక్కజొన్న పంట

పొలాల్లోనే ఆరబోసుకుని ఎదురుచూపులు

అకాల వర్షానికి తడుస్తున్న వైనం


డీ హీరేహాళ్‌, మే 15 : మద్దతు ధరతో రైతుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని గొప్పలు పోతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో రైతుకు మొండిచేయి చూపుతోంది. ఆర్భాటంగా ప్రకటనలివ్వడమే తప్పా, కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టడం లో విఫలమవుతోంది. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసి నీటిపాలవుతోందిది. మండలవ్యాప్తంగా మొక్కజొన్న పంట పండించిన రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. మండలం లో సుమారు 400 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. సుమా రు పది వేల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని రైతలు రోజూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు తమ పంటను కొనుగోలు చేస్తారో లే దో తెలియని అయోమయంలో రైతులు వున్నారు. కనీసం పండించిన పం టను సంచులలో నింపుకుని భద్రపరచడానికి కూడా సంచుల కొరత వే ధిస్తోంది. దీంతో పొలాల వద్దనే ఆరుబయట పంటను నిల్వ వుంచారు. అ కాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయి రైతులకు తీరని నష్టాన్ని మి గులుస్తోంది. కనీసం సంచులు అందించినా పంటను భద్రపరచుకుని ప్ర భుత్వానికి అమ్ముకుంటామని రైతులు అంటున్నారు.పంట కొనుగోలుకు సంబంధించి ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులను వేడుకున్నా ఇంతవరకు ప ట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పం ట వర్షానికి తడుస్తుండటంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతోంద ని అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. చాలా మంది రైతులకు ఈ పరిస్థితుల్లో ఏమిచేయాలో దిక్కుతోచడం లేదు. తమ పంట ఉత్పత్తులను తక్కువ ధరకే కర్ణాటకలోని బళ్లారి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 


చేతికొచ్చిన పంట నోటికందడం లేదు: 

అప్పన్నరెడ్డి, రైతు, మల్లికేతి గ్రామం

 ఆరు ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశా. నెల రోజుల క్రితం కోత వేశాము. 140 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంటను ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు స్వయంగా రైతు వద్దకు వచ్చి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు. దీంతో మొక్కజొన్న పంటను పొలంలోనే వుంచుకున్నా. కానీ ఇంతవరకు ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ప్రతిరోజూ కురుస్తున్న వర్షానికి పంట పూర్తిగా తడిసిపోతోంది.  చేతికొచ్చిన పంట నోటికందక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం పండించిన పంటను భద్రపరచుకోవడానికి సంచులను కూడా అందించడం లేదు.  

Updated Date - 2021-05-16T06:03:20+05:30 IST