బకాయిల చె ల్లింపులో జాప్యం తగదు

ABN , First Publish Date - 2022-08-11T04:36:18+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల అత్యవసరాల నిమిత్తం పొదుపు చేసుకున్న సొమ్మును చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర నేతలు కె.బాలగంగిరెడ్డి, ఆర్‌.గురుకుమార్‌, ఇలియాజ్‌ బాషా పేర్కొన్నారు.

బకాయిల చె ల్లింపులో జాప్యం తగదు

కడప(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 10: ఉద్యోగ, ఉపాధ్యాయుల అత్యవసరాల నిమిత్తం పొదుపు చేసుకున్న సొమ్మును చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర నేతలు కె.బాలగంగిరెడ్డి, ఆర్‌.గురుకుమార్‌, ఇలియాజ్‌ బాషా పేర్కొన్నారు. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ తదితర బిల్లులు చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రమణారెడ్డి, జిచెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల తమ జీతాల నుంచి ప్ర తి నెలా మినహాయించి, వారి ఖాతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును తీసుకోవాలన్నా నెలల తరబడి ఎదురు చూసి ఇబ్బందులకు గురవడం ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర నేతలు సంగమేశ్వరరెడ్డి, బాలరాజు, రషీద్‌ఖాన్‌, పాలకొండయ్య, చంద్రశేఖర్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి మహబూబ్‌బాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:36:18+05:30 IST