వరిసాగులో ధరాభారం

ABN , First Publish Date - 2022-05-18T06:58:42+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరం పెరిగింది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ ధరలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ కారణంగా రైతులకు ఏటా పంటల సాగు భారంగా తయారైంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, పంటసాగు ఖర్చులు పెరుగుతుండడంవల్ల వ్యవసాయం అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు.

వరిసాగులో ధరాభారం

  • పెరిగిన డీజిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ ధరలతో రైతుల ఇక్కట్లు
  • సాగుకు పెరిగిన ఖర్చులు.. రాబడి అంతంతే..
  • దుక్కులు, దమ్ములకు ట్రాక్టర్లు, వరికోతలకు యంత్రాల వినియోగం
  • వీటన్నింటిపైనా ధరల పెంపు ప్రభావం

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరం పెరిగింది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ ధరలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ కారణంగా రైతులకు ఏటా పంటల సాగు భారంగా తయారైంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, పంటసాగు ఖర్చులు పెరుగుతుండడంవల్ల వ్యవసాయం అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. 

సామర్లకోట, మే 17: గతేడాది లీటర్‌ డీజిల్‌ రూ.89 ఉండగా ఈ ఏడాది మే నెల మంగళవారం నాటికి లీటర్‌ ధర రూ.107.46కు పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.18 నుంచి రూ.20కి పెరిగింది. ఇక ఇంజిన్‌ ఆయిల్‌ ధరలు లీటర్‌కు రూ.20 నుంచి రూ.30కి పెరిగింది. వ్యవసాయంలో దుక్కి దున్ను మొదలు దమ్ము, పంటకోతలు, మాసూళ్లు, రవాణా వంటి పనులకు ట్రాక్టర్‌, వరికోత యంత్రాలను విధిగా రైతులు విని యోగిస్తున్నారు. దీంతో పెరుగుతున్న డీజిల్‌ ధరలు కారణంగా ఎకరాకు ఒక సీజన్‌కు రూ.600నుంచి రూ.800 వరకూ అదనపు భా రంగా మారింది. మరోవైపు వరి పంట కోసేందుకు కూలీలు దొరకడం లేదు. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో యంత్రాలపై ఆధా రపడడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోయాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత జీవనోపాధి కోసం పట్టణాలకు వలస కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సహజంగానే కూలీల కొరత ఏర్పడింది. ఈ కారణంగా వ్యవసాయంలో కూలీల ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది. వరిసాగులో కూలీల కొరతను అధిగమించ డం, అయ్యే ఖర్చును తగ్గించేందుకు యంత్రాలపైనే ఆధారపడుతు న్నారు. పంట పండించేందుకు అయ్యే ఖర్చును తగ్గించి ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను ఆర్జించేందుకు ఆధునిక వ్యవసాయ పరికరా లను, యంత్రాలను రైతులు వినియోగిస్తున్నారు.

పెరుగుతున్న ఖర్చులు

సన్న, చిన్నకారు, కౌలురైతులు ట్రాక్టర్లను అద్దెకు తెచ్చుకుని దుక్కు లు దున్నిస్తారు. డీజిల్‌ ధరల ఆధారంగానే వాటికి అద్దెలు చెల్లిస్తుం టారు. గతేడాది సీజన్‌కు ముందుగా డీజిల్‌ లీటర్‌కు రూ.67.88 నుంచి ప్రస్తుతం గురువారం మార్కెట్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.107కు పెరి గింది. ఈ నేపథ్యంలో వరికోతల యంత్రాల అద్దెలు సైతం వాటి య జమానులు పెంచారు. గతేడాది పొ లం దుక్కు దున్నేందుకు, దమ్ములు చేసేందుకు ఆయా ప్రాంతాల మట్టి స్వభావాన్ని బట్టి ఎకరాకు రూ.1000 నుంచి రూ.1200 వరకూ తీసుకోగా ఈ దాళ్వా సీజన్‌లో రూ.1600 నుం చి రూ.1700 వరకూ తీసుకున్నట్లు రైతులు తెలిపారు. ఇటీవల పంట కోతలకు వచ్చేసరికి పెట్టుబడి భారం మరింత పెరిగిందని వారు వాపోతున్నారు. పెట్టుబడి పెరుగు తున్నా రాబడి మాత్రం ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పెట్టుబడులు వస్తే అదే చాలు

ఓవైపు మేఘాలు కమ్ముకోవడం, ఈదురుగాలులుతో కూడిన వ ర్షాలతో కూడిన వాతావరణంతో దాళ్వా వరిపంట కోతలకు రావడంతో రైతన్నలు బెంబేలెత్తున్నారు. వర్షం పడితే గింజలు నేల రాలుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. డీజిల్‌, ఇంజినాయిల్‌, కూలీల రేట్లు, వరికోత యంత్రాల అద్దెలు గణనీయంగా పెరగడంవల్ల పంట సాగు ఖర్చులు అధికమై చివరకు ఏమీ మిగలడంలేదని రైతులు వాపోతు న్నారు. ఇక వరికోత యంత్రాలు ఉన్నా డిమాండ్‌ మేరకు వాటి కోసం ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. వాటికి సైతం గతేడాదితో పోలిస్తే గంటకు రూ.200 నుంచి రూ.300 వరకూ అద్దె ధరలు పెంచడంతో రైతులకు భారంగా మారింది. గతేడాది వరికోత యంత్రానికి గంటకు రూ.2,000 నుంచి రూ.2200 వరకూ తీసుకుంటే ఈ సీజన్‌లో ప్రాంతా ల ఆధారంగా రూ.2,400 నుంచి రూ.2,500 వరకూ వసూలు చేస్తు న్నారు. పొలంనుంచి ధాన్యాన్ని రైతు ఇంటికి తరలించాలన్నా కిలో మీటర్‌కు రూ.500 నుంచి రూ.700 వరకూ వసూల చేస్తున్నారు. పం ట దిగుబడి వచ్చిన తర్వాత ఎకరా పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలంటే కనీసం రూ.4వేల నుంచి రూ.4,500 వరకూ ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. మొత్తానికి చూస్తే గతేడాదికి, ప్రస్తుత సీజన్‌కు వరిపంటకు 20శాతం వరకూ పెట్టుబడులు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు.

డీజిల్‌ ధరలతో పెరిగిన భారం

జిల్లాలో దాళ్వా సీజన్‌లో సాగు చేసిన 4,07,902 ఎకరాల్లో వరికోత యంత్రాలను వినియోగించడం ద్వారా పెరిగిన భారం ఎకరాకు రూ.300 నుంచి రూ.400కు పెరగడం వల్ల రూ.10.19కోట్ల మేర భారం అయ్యింది. సీజన్‌ ప్రారంభంలో దుక్కులు, దమ్ములు పనులకు ట్రాక్టర్లను వినియోగించిన కారణంగా ఎకరాకు అదనంగా రూ.400 చొప్పున ఉండడంతో సాగు చేసిన 4,07,902 ఎకరాలకు రూ. 16.31 కోట్ల మేర భారంగా మారింది. మొత్తం దాళ్వా సీజన్‌ కారణంగా పెరిగిన డీజిల్‌ ధరల కారణంగా ఉమ్మడి జిల్లాలో రైతన్నలకు రూ.26.50 కోట్ల మేర అదనపు భారంగా పరిణమించిందని వారు చెబుతున్నారు.

Updated Date - 2022-05-18T06:58:42+05:30 IST