కడప(క్రైం), డిసెంబరు 2: కడప నగరం ద్వారకనగర్‌లో విద్యుత్ వైరు తగిలి నాగరాజు ఆలియాస్ రాజు (46) మృతి చెందినట్లు వన్‌టౌన్ ఎస్ఐ హసామ్ తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన నాగరాజు పన్నెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం కడప నగరానికి వచ్చి భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ద్వారకానగర్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. బుఽధవారం ఇంటి యజమాని ఆవరణమంతా శానిటేషన్ చేయించగా, అక్కడున్న ప్లగ్‌బాక్స్ వైరు చుడుతూ ప్రమాదవశాత్తు వైరు తగిలి నాగ రాజు మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.