Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీటితో డీహైడ్రేషన్‌ దరిచేరదు

బ్రొకోలిలో పోషకాలతో పాటు 89 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేసవి అలర్జీలపై పోరాటం చేసే శక్తిని కూడా ఇస్తాయి. 

పాలకూరలో 95 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. ప్రొటీన్‌ శాతం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అద్భుతంగా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్‌, ఫైబర్‌, ఐరన్‌, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. 

ఉడికించిన బియ్యంలో 70 శాతం నీరు ఉంటుంది. ఇది కూడా శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా కాపాడుతుంది. రైస్‌ తీసుకోవడం ద్వారా ఐరన్‌, కార్బోహైడ్రేట్స్‌ లభిస్తాయి. 

యాపిల్‌లో 86 శాతం నీరుంటుంది. అంతేకాకుండా ఫైబర్‌, విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తాయి. 

వేసవిలో డీహైడ్రేషన్‌ బారినపడకుండా కాపాడటానికి పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో 85 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్‌గా పిలిచే మైక్రో ఆర్గానిజమ్స్‌ ఉంటాయి. వీటివల్ల వేసవిలో వచ్చే అలర్జీలపై పోరాడే శక్తి వస్తుంది. ప్రొటీన్‌, విటమిన్‌ బి, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి.

వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. అయితే ఘనపదార్థాల్లోనూ నీటిశాతం ఉంటుంది. నీళ్లతో పాటు ఈ ఘనపదార్థాలను తీసుకున్నప్పుడే శరీరంలో వాటర్‌ లెవెల్స్‌ బ్యాలెన్స్‌ అవుతాయి.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement