డీహైడ్రేషన్‌కు లోనవకుండా...

ABN , First Publish Date - 2020-09-14T20:48:50+05:30 IST

ఎక్కువ సమయం వ్యాయామం చేయడం, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. దీంతో జీవక్రియల

డీహైడ్రేషన్‌కు లోనవకుండా...

ఆంధ్రజ్యోతి(14-09-2020)

ఎక్కువ సమయం వ్యాయామం చేయడం, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది.  డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. దీంతో జీవక్రియల లయ దెబ్బతింటుంది. అంతేకాదు కాలేయం, మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపడంతో పాటు జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. డీహైడ్రేషన్‌ సమస్య నుంచి బయటపడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు, మై22బీఎంఐ స్థాపకురాలు ప్రీతీ త్యాగీ.  


 క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లేవారు, ఎదుగుతున్న పిల్లలు వాటర్‌బాటిల్‌లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్లను వెంట తీసుకెళ్లాలి. ఈ నీళ్లు తాగితే ఎలక్రోలైట్స్‌ అందుతాయి. 


కాచి చల్లార్చిన నీళ్లను తాగడం అన్ని విధాలా మంచిది.


నీళ్లతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, ఎక్కవ శాతం నీరు ఉండే కీరదోస, చిలగడదుంప, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, మస్క్‌మెలన్‌, నిమ్మజాతి పండ్లను తినాలి.


 గ్లాసు వేడినీళ్లలో జీలకర్ర , మెంతి, సోంపు, తులసి పొడి కలిపి తాగితే ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవచ్చు. కాఫీ, టీ, స్వీట్లు, వేపుడు ఆహారపదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూనే జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు రోజూ వ్యాయామాలు చేస్తూ ఉండాలి.                                  




Updated Date - 2020-09-14T20:48:50+05:30 IST