‘డిగ్రీ విద్యార్థులను బేషరతుగా పాస్‌ చేయాలి’

ABN , First Publish Date - 2021-04-21T05:27:55+05:30 IST

డిగ్రీ 2,4, సెమిస్టర్‌ విద్యార్థులను ప్రభుత్వమే బేషరతుగా పాస్‌ చేయాలని టీజీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘డిగ్రీ విద్యార్థులను బేషరతుగా పాస్‌ చేయాలి’

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20 : డిగ్రీ 2,4, సెమిస్టర్‌ విద్యార్థులను ప్రభుత్వమే బేషరతుగా పాస్‌ చేయాలని టీజీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యా లయం అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ సాయగౌడ్‌కు డిగ్రీ, పరీక్షలు, ఫలితాలు ఫీజుల విషయమై మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా నాయకుడు బొబ్బిలి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. డిగ్రీ సప్లిమెంటరీ, రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. కరోనా మొదలై ఏడాది కాలంగా డిగ్రీ విద్యా ర్థులకు భౌతికంగా క్లాస్‌లు జరగలేదని నిర్వహించిన క్లాస్‌లు కూడా 35రోజులేనని పేర్కొ న్నారు. ఆన్‌లైన్‌ తరగతుల పేరు చెప్పి చాలా వరకు సిలబస్‌ పూర్తి కాలేదని, తరగతులు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థం కాలేదన్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు విని విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమని, విద్యార్థులు ఫెయిల్‌ అయి మానసికంగా క్షోభ అను భవిస్తున్నరని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల కరోనా కష్టకాలంలో చదువుల కోసం పరీక్షల ఫీజులు, కళాశాల ఫీజులు అని చెప్పి రూ.లక్షల్లో అప్పుల్లో కూరుకుపోతున్నారని విద్యార్థుల చదువుల్లో ఉత్తీర్ణత తగ్గిపోవడం వల్ల ఆందోళన పడుతున్నారన్నారు. 2, 4వ సెమిస్టర్‌లే ఇందుకు నిదర్శనమన్నారు. 2వ సెమిస్టర్‌లో 11,028 పరీక్షలు రాయగా ఉత్తీర్ణత 2,945 మంది అని, 4వ సెమిస్టర్‌లో 8827కు 2947 మాత్రమే ఉత్తీర్ణత సాధిం చారని తెలిపారు. కళాశాల యాజమాన్యలు, వర్సిటీ అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నరని, 2,4, సెమిస్టర్‌ రాసిన విద్యార్థులను వర్సిటీ అధికారులు పాస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌, సప్లిమెంటరీ ఫీజులను రద్దుచే సి ప్రభుత్వమే భరించలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, ఆకాశ్‌, రాహుల్‌, దేవేందర్‌, అనూష, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:27:55+05:30 IST