Telangana BC గురుకులాల్లో డిగ్రీ కోర్సులు

ABN , First Publish Date - 2022-10-05T20:56:14+05:30 IST

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. జిల్లాలవారీగా మొత్తం

Telangana BC గురుకులాల్లో డిగ్రీ కోర్సులు

హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. జిల్లాలవారీగా మొత్తం 15 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏడింటిని మహిళలకు ప్రత్యేకించారు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్‌లలో పలు గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కళాశాలలో గ్రూప్‌నకు 40 చొప్పున మొత్తం 4800 సీట్లు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. 


బీఎస్సీ సబ్జెక్ట్‌లు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, జియాలజీ, డైటెటిక్స్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ

బీకాం సబ్జెక్ట్‌లు: కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, జనరల్‌


బీఏ సబ్జెక్ట్‌లు: ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌


జిల్లాలవారీ డిగ్రీ కళాశాలలు

  • కరీంనగర్‌ - కరీంనగర్‌, ఎల్లారెడ్డిపేట్‌ - రాజన్న సిరిసిల్ల, ధర్మపురి - జగిత్యాల. నిజామాబాద్‌ - నిజామాబాద్‌, ఖమ్మం - ఖమ్మం, హైదరాబాద్‌ - హైదరాబాద్‌, కందుకూరు - రంగారెడ్డి, మేడ్చల్‌ - మేడ్చల్‌ మల్కాజిగిరి, పాలకుర్తి - జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ - జనగామ, నాగార్జునసాగర్‌ - నల్లగొండ, దేవరకద్ర - మహబూబ్‌నగర్‌, వనపర్తి - వనపర్తి, మెదక్‌ - మెదక్‌, నిర్మల్‌ - నిర్మల్‌

అర్హత: ఈ ఏడాది ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అనాధ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీ కేటగీరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో ఎంచుకొనే గ్రూప్‌ను అనుసరించి ఇంటర్‌ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌లు చదివి ఉండాలి.  బీకాం(జనరల్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌), బీబీఏ, బీఏ ప్రోగ్రామ్‌లకు ఏ గ్రూప్‌ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదటి అటెంప్ట్‌లోనే కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు చాలు. ఇంటర్‌ ఇన్‌స్టంట్‌ ఎగ్జామినేషన్‌ రాసిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు చేసినవారు కూడా అర్హులే. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000లకు; పట్టణాల్లో రూ.2,00,000లకు మించకూడదు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.200 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: mjptbcwreis.telangana.gov.in

Updated Date - 2022-10-05T20:56:14+05:30 IST