రక్షణరంగ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-25T06:04:42+05:30 IST

రక్షణ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాల ని కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని సీఐటీ యూ ఆర్జీ-2 కార్యదర్శి ఉల్లి మొగిలి డిమాండ్‌ చేశారు.

రక్షణరంగ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
సీహెచ్‌పీలో నిరసన వ్యక్తం చేస్తన్న నాయకులు

యైటింక్లయిన్‌కాలనీ, జూలై 24: రక్షణ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాల ని కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని సీఐటీ యూ ఆర్జీ-2 కార్యదర్శి ఉల్లి మొగిలి డిమాండ్‌ చేశారు. శనివారం ఓసీపీ-3 సీహెచ్‌పీలో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 26 నుంచి రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు నిరవధి క సమ్మెకు పిలుపనిచ్చారని, వారికి మద్దతుగా సింగరేణిలో నిరసన కార్య క్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ను ప్రైవేటీకరణ చేస్తున్నదని, రక్షణ రంగాన్ని ప్రైవేట్‌కు అప్పగించడం స మంజసం కాదన్నారు. దేశంలోని 41 రక్షణ రంగ సంస్థల్లో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 41 సంస్థలను ఏడు కంపెనీలుగా విభజించి ప్రైవేటీకరించే చర్యలు ప్రారంభమైనట్టు తెలిపారు. అత్యవసర ఆర్డినెన్స్‌ ద్వారా ప్రైవేటీకరణకు పూనుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కార్మికు లు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ వెంకన్న, భూమయ్య, రాజేష్‌, మల్లేష్‌, రవితో పాటు కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:04:42+05:30 IST