చైనా రక్షణమంత్రిని కలిసిన రాజ్‌నాథ్... రెండు గంటల పాటు భేటీ!

ABN , First Publish Date - 2020-09-05T11:38:13+05:30 IST

వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నడుమ భారత్, చైనాల మద్య భేటీ జరిగింది. రష్యా రాజధాని మాస్కోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ...

చైనా రక్షణమంత్రిని కలిసిన రాజ్‌నాథ్... రెండు గంటల పాటు భేటీ!

న్యూఢిల్లీ: వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నడుమ భారత్, చైనాల మద్య భేటీ జరిగింది. రష్యా రాజధాని మాస్కోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి వీ ఫెంగేను కలిశారు. వీరిరువురూ ప్రస్తుతం  షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు రష్యా చేరుకున్నారు. రాజ్ నాథ్ సింగ్... వీ ఫెంగేల మధ్య 2 గంటల 20 నిముషాల పాటు భేటీ జరిగింది. మే మాసం మొదలుకొని చైనా భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అది మొదలు ఇప్పటి వరకూ పలుమార్లు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల రక్షణశాఖ మంత్రులు ఉన్నత స్థాయిలో సమావేశమవడం ఇదే తొలిసారి. 

Updated Date - 2020-09-05T11:38:13+05:30 IST