మహిళలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-05-15T06:24:08+05:30 IST

జగన్‌రెడ్డి మూడు సంవత్సరాల కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

మహిళలకు రక్షణ కరువు
చిలుకూరు దళితవాడలో సమస్యలు వింటున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

చిలుకూరులో మాజీ మంత్రి ఉమా

చిలుకూరు(ఇబ్రహీంపట్నం), మే 14 : జగన్‌రెడ్డి మూడు సంవత్సరాల కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చిలుకూరులో శనివారం బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలు బలైపోతుంటే జగన్‌రెడ్డి మహిళలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరమన్నారు. తిరుపతి సభలో ఆయన యాగీ ఏమిటో.....ఏదో..ఏదేదో అంటూ సమస్యను పక్కదారి పట్టించే దుస్థితికి దిగజారిపోవటం దురదృష్టకరం అన్నారు. డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా దొరకుతుండటంతో గల్లికో సైకో తయారైయ్యాడని అన్నారు. మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలు చేస్తున్నారని అన్నారు. పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు క్రమబద్ధీకరణ వంటి హామీల్లో మాటతప్పారని ఉమా అన్నారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు. రూ.మూడు వేల కోట్లు ఖర్చుపెట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు చేస్తే మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు.  గ్రామాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన ఎమ్మెల్యే తన బామ్మర్ది, నవగ్రహాలతో దోచుకొండి.. దాచుకొండి అని చెప్పి రియల్‌ఎస్టేట్‌ వ్యా పారం చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షుడు రామినేని రాజశేఖర్‌, జంపాల సీతారామయ్య, చుట్టుకుదురు శ్రీనివాసరావు, కాటేపల్లి సుబ్బారావు, అబ్బూరి ప్రసాద్‌ పాల్గొన్నారు.


 పెద్దాపురం, చెన్నారావుపాలెం గ్రామాల్లో బాదుడే-బాదుడు

వీరులపాడు : వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని టీడీపీ మండల అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్‌కుమార్‌ అన్నారు.  పెద్దాపురం, చెన్నారావుపాలెం గ్రామాల్లో శనివారం బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో నాయకులు దాములూరి మధుసూదనరావు, పసుపులేటి పుల్లారావు, నిమ్మల రాజేంద్ర, బలుసుపాటి బాబురావు, యర్రగుంట కృష్ణారావు, కోడెల కుటుంబరావు, మల్లెల గురవయ్య, పల్లెకంటి రోశయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-15T06:24:08+05:30 IST