రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-05-23T06:22:53+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని... మూడేళ్లుగా దళితులపై దాడులు, హత్యలు జరుగుతుం డడ మే ఇందుకు నిదర్శనమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు
కదిరిలో కాగడాలతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

 ఎమ్మెల్సీ కారుడ్రైవర్‌ హత్యపై టీడీపీ నాయకుల నిరసన

కదిరిఅర్బన, మే 22: రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని... మూడేళ్లుగా దళితులపై దాడులు, హత్యలు జరుగుతుం డడ మే ఇందుకు నిదర్శనమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ కారు డ్రైవర్‌ హత్యను నిరసిస్తూ ఆదివారం టీ డీపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉదా సీనత, అసమర్ధత వల్లే రాష్ట్రంలో వరుసగా దళితులపై దాడులు, హత్యలు అధికమయ్యాయన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ సుబ్రమణ్యంను హత్య చేసి, ప్రమాదంలో మృతిచెందినట్లు చిత్రీక రిస్తున్నారని ఆరోపించారు. దళిత హోంమంత్రి ఉన్నప్పటికి దళితులపై దాడులను అరికట్టడంలో విఫలమన్నారు. శనివారం కాకినాడ జీజీహెచ ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం సరికాద న్నారు. ఎమ్మెల్సీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షిం చాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపూరి శెట్టి చంద్రశేఖర్‌, రాజశేఖర్‌బాబు, చెన్నకేశవులు, డైమండ్‌ ఇర్షాన, మహ మ్మద్‌వలి, శేషు, బాబు, మహిళనాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. 

తనకల్లు: రాష్ట్రంలో మూడేళ్లుగా దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో ఆదివారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా మండల క న్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి, తెలుగుయువత నాయకుడు ప్రవీణ్‌కుమార్‌ మాట్లా డుతూ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు జయసాయి  ప్రభాకర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తోట సరోజమ్మ, మాజీ ఎంపీటీసీలు రమణయ్య, లాలుసాబ్‌, మైనార్టీ అధ్యక్షులు దస్తగిరి, పీజీ మల్లికార్జున, షాక్కీర్‌, చంద్రప్ప, ఓబులేసు తదితరులునానరు. 

తలుపుల: కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేసి, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు మండలకేంద్రంలోని మూడు రోడ్ల కూడలి వద్ద ధర్నా చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశా ల మేరకు మండల కన్వీనర్‌ ముబారక్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ అయిన సుబ్రహ్మణ్యంను హత్యకు గురైనా ఆత్మహత్యగా చిత్రీక రించడం శోచనీయమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దళితులకు అన్యాయం చేయడం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముభారక్‌, రాజారెడ్డి, శ్రీనివాసులు, జయచంద్ర, రమణయ్య, అజంతుల్లా, రాధాక్రిష్ణ, శివశంకర్‌రెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T06:22:53+05:30 IST