Abn logo
Oct 24 2021 @ 00:40AM

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 23: మండలంలోని నా గలూరు గ్రామానికి చెందిన మట్టేద్దుల శివారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో అదేగ్రామానికి చెందిన రమణప్ప, పోతలయ్య, లింగప్పలతో పాటు మరో ఆరుగురిని అరెస్టుచేసి నట్లు రూరల్‌ సీఐ మన్సూరుద్దీన్‌ శనివారం తెలిపారు. ఆ యన మాట్లాడుతూ ఈనెల 17న గ్రామానికి చెందిన పోత లయ్య, రమణప్ప, లింగప్పలతో పాటు మరో ఆరుగురు కొడవళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారని శివారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారన్నారు. పీర్లచావడి వద్ద ఏ ర్పాటు చేసిన బండరాయి వల్ల రహదారికి సమస్యగా మా రుతుందని తెలపడంతో దాడికి యత్నించారని ఫిర్యాదు పేర్కొన్నారన్నారు. శివారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరికి రిమాండ్‌ విధించడంతో అనం తపురం జైలుకు తరలించామన్నారు.