తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తానని మోసం

ABN , First Publish Date - 2022-01-21T17:32:00+05:30 IST

తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా, చాట్రాయి గ్రామానికి చెందిన పొనగంటి

తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తానని మోసం

నిందితుడికి రిమాండ్‌

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌: తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా, చాట్రాయి గ్రామానికి చెందిన పొనగంటి తేజ్‌కుమార్‌(28) ఎంబీఏ పూర్తి చేశాడు. బేగంపేట బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో అసిస్టెంట్‌ సేల్స్‌ మేనేజర్‌గా, ఆ తరువాత అమీర్‌పేటలోని హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వెళ్లి ఆన్‌లైన్‌లో రమ్మీగేమ్‌లు ఆడేవాడు. అందులో నష్టం రావడంతో గతంలో తాను పనిచేసిన బజాజ్‌ ఫైనాన్స్‌లో రుణం తీసుకున్న కొంతమందికి ఫోన్‌ చేసి తక్కువ వడ్డీరేటుతో వారి ఖాతాలను బదిలీ చేస్తానని, మరికొంతమందికి ఫోన్‌ చేసి ఇంటి కోసం రుణం ఇప్పిస్తానని చెప్పి ప్రాసెసింగ్‌ ఫీజు కింద డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. జీడిమెట్లకు చెందిన చంద్రకాంత్‌ రాంపల్లి వద్ద రూ. 32,869 తీసుకొని మోసం చేశాడు. బాధితుడు సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తేజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌, ఎల్‌బీనగర్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధుల్లో పలువురిని మోసం చేసి రూ. 2,30,000 వసూలు చేశానని అంగీకరించాడు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-01-21T17:32:00+05:30 IST