బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్

ABN , First Publish Date - 2022-02-02T00:13:11+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన కుమ్మరిపాలెం బాలిక

బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్ విధించారు. నిందితుడు వినోద్ జైన్‌ను విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు వినోద్ జైన్‌కు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. వినోద్‌ జైన్‌ను మచిలీపట్నంలోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 


భవానీపురం పున్నమి హోటల్‌ సమీపంలోని లోటస్‌ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న ఓ బాలిక (14) శనివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ ఐదో ఫ్లోర్‌ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌ను ఆమె తల్లిదండ్రుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్న కారణంగానే చనిపోతున్నట్టు బాలిక సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

 

Updated Date - 2022-02-02T00:13:11+05:30 IST