చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-29T05:36:35+05:30 IST

బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ యల్లంరాజు తెలిపారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌
నిందితున్ని చూపుతున్న సీఐ

నల్లమాడ, అక్టోబరు 28: బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని  అరెస్ట్‌ చేసినట్లు సీఐ యల్లంరాజు తెలిపారు. నల్లమాడ, పుట్టపర్తి, బు క్కపట్నంలో  ఈ నెల 23న  నేను ప్రభుత్వ ఉద్యోగినంటూ జ్యువెల్లరీ దుకాణ యజమానులకు నమ్మబలికి ఆభరణాలు కొనేపేరుతో వాటిని తీసుకుని ఉడాయించాడన్నారు. సీఐ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా యోగిమల్లవరం చెందిన శ్రీనివాసరెడ్డి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడన్నాడు. ఆకోవలో మూడు దుకాణాల్లో ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి 17 గ్రాములు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి డబ్బు బండిలో ఉంది తీసుకొస్తానంటూ చెప్పి పరారీ అయినట్లు తెలిపారు. కేసును దర్యాప్తు చేపట్టి నింది తుడిని బుధవారం సాయంత్రం నల్లమాడ వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇతనిపై తెలంగాణలో కూడా ఐదు చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు, షాపుల యజమానులు కొత్తవ్యక్తులు వస్తే మోసపోవద్దని , అను మానంగా తిరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలియ జేయాలని సీఐ కోరారు. బంగారు షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపాడు.


Updated Date - 2021-10-29T05:36:35+05:30 IST