ప్రజాస్వామ్యాన్ని పరరక్షించండి

ABN , First Publish Date - 2021-10-20T05:39:06+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా మంగళవారం రాత్రి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ప్రజాస్వామ్యాన్ని పరరక్షించండి
నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు




టీడీపీ కార్యాలయంపై దాడులు దారుణం

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 19:రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు.  తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా మంగళవారం రాత్రి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం  వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడే అనైతిక చర్యకు.. కొత్త సంస్కృతికి వైసీపీ తెరతీసిందన్నారు. వైసీపీ నాయకుల చర్యలను ప్రతిఒక్కరూ చీదరించుకుంటున్నారని విమర్శించారు. అఫ్ఘానిస్తాన్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ బిల్లులు, కోతలు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు.. ఇలా అన్ని అంశాలపై ప్రజలు రగిలిపోతున్నారన్నారు. ప్రజలపక్షాన ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరించాలని చూస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. గతంలో జగన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తాము అడ్డుకొంటే వైసీపీ అఽధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పునాదులు చాలా గట్టివని..వాటిని ఎవరూ కదిలించలేరని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, ఐటీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, నగర అధ్యక్షుడు ఎం.వెంకటేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-20T05:39:06+05:30 IST