నిరాటంకంగా భారత్‌కు రష్యా ఆయుధాల సప్లయ్

ABN , First Publish Date - 2022-04-15T03:04:48+05:30 IST

న్యూఢిల్లీ : రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌కు చేరాల్సిన ఆయుధ సప్లయ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోంది.

నిరాటంకంగా భారత్‌కు రష్యా ఆయుధాల సప్లయ్

న్యూఢిల్లీ : రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌కు చేరాల్సిన ఆయుధ సప్లయ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోంది. భారత్‌కు అందాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, విడి భాగాలు చేరుతున్నాయి. అయితే భవిష్యత్‌లో కూడా అక్కడ నుంచి ఆయుధాల రవాణా కొనసాగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏ రూపంలో పేమెంట్లు చేయాలనేదానిపై ఇంకా స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా ఉందని ఓ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. బలగాలకు ఆయుధాల సప్లయ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని అధికారి పేర్కొన్నారు. అయితే ఇదే విధంగా సప్లయ్ కొనసాగుతుందా అంటే చెప్పలేమన్నారు. రష్యన్ సంస్థలకు చెల్లింపులకు సంబంధించి భారత్ ఎలాంటి విధానాన్ని గుర్తించలేకపోవడం ఇందుకు కారణమని అధికారి పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్, రష్యా వర్గాలు కృషిచేస్తున్నాయని, అనేక మార్గాలను పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

Updated Date - 2022-04-15T03:04:48+05:30 IST