Vietnam President ను కలుసుకున్న రక్షణమంత్రి Rajnath Singh

ABN , First Publish Date - 2022-06-08T22:28:26+05:30 IST

వియత్నాం అధ్యక్షుడు(Vietnam President) న్యూయెన్ జువాన్ పిక్(Nguyen Xuan Phuc)ను భారత రక్షణశాఖ మంత్రి(Defence Minister) రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) బుధవారం కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆగ్నేయ ఆసియా పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్..

Vietnam President ను కలుసుకున్న రక్షణమంత్రి Rajnath Singh

హానోయ్: వియత్నాం అధ్యక్షుడు(Vietnam President) న్యూయెన్ జువాన్ పిక్(Nguyen Xuan Phuc)ను భారత రక్షణశాఖ మంత్రి(Defence Minister) రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) బుధవారం కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆగ్నేయ ఆసియా పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్.. మంగళవారం వియత్నాం చేరుకున్నారు. అనంతరం రాజధాని హానోయ్‌లోని వియత్నాం జాతిపిత హో చి మిన్‌ సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం వియత్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక బుధవారం ఆ దేశాధినేతను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.

Updated Date - 2022-06-08T22:28:26+05:30 IST