Minister KTR వ్యాఖ్యలపై రక్షణ శాఖలో తర్జనభర్జన.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2022-03-17T12:08:01+05:30 IST

Minister KTR వ్యాఖ్యలపై రక్షణ శాఖలో తర్జనభర్జన.. ఏం జరుగుతుందో..!?

Minister KTR వ్యాఖ్యలపై రక్షణ శాఖలో తర్జనభర్జన.. ఏం జరుగుతుందో..!?

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తామంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రక్షణ శాఖ వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయన వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించే విషయమై రక్షణ శాఖ వర్గాల్లో తర్జనభర్జనలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నింటినీ తాము ఎప్పటికప్పుడు పరిశీలనలోకి తీసుకున్నామని, ప్రతి ఒక్క అంశంపై స్పష్టత ఇచ్చామని, అయినప్పటికీ రక్షణశాఖ సహకరించడం లేదంటూ తరచూ కేటీఆర్‌ వ్యాఖ్యానిస్తున్నారంటూ సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సాధారణంగా విమర్శలకు, ఆరోపణలను పట్టించుకోకుండా, సంయమనం పాటించే రక్షణ శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. 


గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా రక్షణ శాఖపై బురద చల్లిన ఘటనలు లేవని ఆర్మీకి చెందిన ఓ అధికారి ’ఆఫ్‌ ది రికార్డు’గా వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ స్థావరాలు, సైనిక శిబిరాలు, సంస్థలు, కార్యాలయాలు, పరిశోధన సంస్థలు ఉన్నందున ఐఎ్‌సఐ తదితర ఉగ్రవాద సంస్థల ముప్పు నుంచి కాపాడుకునేందుకు రాత్రి వేళల్లో అడపాదడపా తనిఖీలు చేసి, ప్రజలను అనుమతిస్తామే తప్ప, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలిగించడంలేదన్నారు. అయితే ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు డిఫెన్స్‌ వర్గాలు నిరాకరిస్తున్నాయి.

Updated Date - 2022-03-17T12:08:01+05:30 IST