నిరుద్యోగ సమస్యను పారద్రోలుతాం : మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2020-05-29T10:28:48+05:30 IST

నైపుణ్య ప్రకాశంగా జిల్లాను అభివృద్ధి చే సి నిరుద్యోగ సమస్య పారద్రోతులతామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ..

నిరుద్యోగ సమస్యను పారద్రోలుతాం : మంత్రి సురేష్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 28 : నైపుణ్య ప్రకాశంగా జిల్లాను అభివృద్ధి చే సి నిరుద్యోగ సమస్య పారద్రోతులతామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక స్పందనభవన్‌లో పరిశ్రమలు- మౌలిక సదుపాయాలు అంశంపై సదస్సు జరిగింది. రామాయపట్నంపోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, కనిగిరిలో నిమ్జ్‌, దొనకొండ మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ నిర్మాణానికి శ్రీకారం చుడతామని ఆయన చె ప్పారు.


గ్రానైట్‌ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మా ట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మాణానికి 2141 ఎకరాల్లో డీపీఆర్‌ త యారైందన్నారు. క్రూడాయిల్‌, కెమికల్‌ తయారీ పరిశ్రమ త్వరలో క్రియా రూపం దాల్చనునునానయని, అందుకోసం ప్రత్యేకాధికారిగా జేసీని నియ మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీ-3 నరేంద్రప్రసాద్‌, సీపీవో వెంకటేశ్వర్లు, పరిశ్రమలశాఖ జీఎం చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎంఎల్‌.నరసింహారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:28:48+05:30 IST