Abn logo
Sep 21 2021 @ 01:19AM

యూపీలో పరువు హత్య!

బందా, సెప్టెంబరు 20: యూపీలోని బందా జిల్లాలో ఓ తండ్రి కోపానికి కూతురు బలైంది. సిమౌని గ్రామానికి చెందిన మహమూద్‌ ఖాన్‌ తన కూ తురికి పెళ్లి సంబంధం చూశాడు. ఆ పెళ్లి ఇష్టంలేని ఆమె నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ఇటీవల ఆమె(22) ఆచూకీ తెలుసుకున్న పోలీ్‌సలు తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పొలంలో కూతురిని తండ్రి విచక్షణారహితంగా కర్రలతో కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మరణాన్ని పరువు హత్యగా భావిస్తున్నామని పోలీ్‌సలు తెలిపారు.