ఇప్పటివరకు మీరు ఇలాంటి జింకను చూసి ఉండరు.. వైరలవుతున్న ఫొటో

ABN , First Publish Date - 2021-02-23T22:19:39+05:30 IST

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రం ఫర్రాగట్‌లో ఓ వింత జింక దర్శనమిచ్చింది.

ఇప్పటివరకు మీరు ఇలాంటి జింకను చూసి ఉండరు.. వైరలవుతున్న ఫొటో

టేనస్సీ: అమెరికాలోని టేనస్సీ రాష్ట్రం ఫర్రాగట్‌లో ఓ వింత జింక దర్శనమిచ్చింది. దాని రెండు కనుబొమ్మలు పూర్తిగా వెంట్రుకలతో నిండి ఉన్నాయి. గతేడాది ఆగస్టులో దీన్ని గుర్తించిన నేషనల్ డీర్ అసోసియేషన్.. తాజాగా జింకకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో అదికాస్తా వైరల్ అయింది. అయితే, వైద్య పరిభాషలో దీనిని 'కార్నియల్ డెర్మోయిడ్స్' అంటారని నేషనల్ డీర్ అసోసియేషన్ తెలియజేసింది. అంటే.. కనుబొమ్మలో కార్నియా ఉండాల్సిన చోట చర్మ ఉంటుంది. ఈ జింకకు కూడా ఇలాగే కార్నియా స్థానంలో చర్మ ఉండి దానిపై దట్టమైన వెంట్రుకలు మొలిచాయని యూనివర్శిటీ ఆఫ్ జార్జియాకు చెందిన వన్యప్రాణుల వ్యాధి అధ్యయనం విభాగం పేర్కొంది. 



Updated Date - 2021-02-23T22:19:39+05:30 IST