పెల్లుబికిన దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-14T05:48:13+05:30 IST

ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా దేశభక్తి పెల్లుబికింది. శనివారం విద్యార్థులు, రాజకీయ, ప్రజా, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

పెల్లుబికిన దేశభక్తి
కొడిగెనహళ్లి గురుకుల ప్రతిభా పాఠశాలలో భారతదేశ చిత్రపటం ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన

పెనుకొండ, ఆగస్టు 13: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా దేశభక్తి పెల్లుబికింది. శనివారం విద్యార్థులు, రాజకీయ, ప్రజా, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్య్ర స్ఫూర్తిని ఇనుమడింపజేశారు. పెను కొండలో సబ్‌ కలెక్టర్‌ నవీన ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చే పట్టారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలకు గుర్తుగా, 75 మంది  సమరయోధుల వేషధారణలో చిన్నారులు ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి, వేకువ సేవాసంస్థ సహకారంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్‌ స్వర్ణలత, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌, బ్రహ్మకుమారి హేమలత, వివిధశాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజాప్ర తినిధులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


హిందూపురం అర్బన: పట్టణంలో పలు ప్రభుత్వ, ప్రై వేట్‌ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జైజవాన, జై కిసాన, భారతమాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సువర్ణభారతి కళాశాల విద్యార్థులు 600 అ డుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. రైల్వే రోడ్డు, ఎన్టీఆర్‌సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా ర్యాలీ సాగింది.  ప్రిన్సిపాల్‌ నీలకంఠారెడ్డి, ఏఓ అనిల్‌ పాల్గొన్నారు. బాలాజీ విద్యావిహార్‌ ప్రిన్సిపాల్‌ వీరభద్రప్ప ఆధ్వర్యంలో, మాజీ సై నిక ఉద్యోగులు చిన్నమార్కెట్‌ నుంచి గాంధీ సర్కిల్‌వరకు ర్యాలీగావెళ్లి మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేశారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని నీలకంఠాపురంలో మాజీ మంరత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ఆలయాలు, ఇళ్ల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. రఘువీరారెడ్డి దంపతులు బైక్‌పై పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఊరేగింపు చేపట్టారు. మండలవ్యాప్తంగా పాఠశాలలు, గ్రామ సచివాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.


పరిగి: మండలంలోని కొడిగెనహళ్ళి గురుకుల ప్రతిభా పాఠశాలలో నిర్వహించిన హెరిటేజ్‌ వాక్‌కు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీఆర్‌ఎస్‌ పాఠశాల నుండి ఏఎం లింగన్న ప్రాథమిక పాఠశాల, కొడిగెనహళ్ళి ప్రధాన కూడళ్లలో త్రివర్ణ పతాకాలతో విద్యార్థు లు ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల కార్యదర్శి కేటీ శ్రీధర్‌, ఏపీఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ మురళిధర్‌ బాబు, పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పా ల్గొన్నారు. అదేవిధంగా సేవామందిరంలో స్వాతంత్య్ర స మరయోధులు ఏఎం లింగణ్ణ కుటుంబసభ్యులను ఘనం గా సన్మానించారు. కోడలు శాంతమ్మ, మనమడు కేటీ శ్రీధర్‌ను ఎంపీడీఓ శ్రీలక్ష్మి, ఈఓఆర్‌డీ చంద్రశేఖర్‌ సన్మానించారు. 


అమరాపురం: మండలంలోని తమ్మేడేపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి వీర ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. 


చిలమత్తూరు: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వి ద్యార్థులు, ఉపాధ్యాయ బృందం 500 అడుగుల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. గ్రామ వీధుల్లో ఊరేగి స్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజు, ఎంపీడీఓ రామ్‌కుమార్‌ పాల్గొన్నారు.


గుడిబండ: మండలకేంద్రంలో విద్యార్థులు, ఉపాధ్యా యుల ఆధ్వర్యంలో 450 అడుగుల జెండాతో ప్రదర్శన చేపట్టారు. జాతీయ నాయకుల ఫొటోలను ప్రదర్శించారు.


రొద్దం: మండలకేంద్రంలో ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన ఆ ధ్వర్యంలో ప్రతి ఇంటా జాతీయజెండా ఎగురవేశారు. జూనియర్‌ కళాశాల, ఎంజేపీ పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో జాతీయజెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు భాగ్యలక్ష్మీ, గోపాల్‌, ఉపాధ్యాయు లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు వేణుగోపాల్‌, రవి, గంగాధర్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రదర్శించారు.


మడకశిర టౌన: పట్టణంలో ఎనజీరంగా వ్యవసాయ  ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంపై తహసీ ల్దారు ఆనంద్‌కుమార్‌ జెండా ఎగరవేశారు. ప్రభుత్వ జూనియార్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నగర పంచాయతీ అధికారులు, మహిళా సంఘం సభ్యులు ప్రధా నకూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. సాంస్కృతిక ప్రద ర్శనలు అలరించాయి. మడకశిర కొండపై తెలుగుదేశం నాయకులు జాతీయజెండాను ఎగురవేశారు. 


లేపాక్షి: స్థానిక కేజీబీవీ విద్యార్థులు మువ్వన్నెల జెం డాతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల వద్ద నుంచి లేపాక్షి పురవీధుల్లో దేశభక్తి గీతాలతో ప్రదర్శన సాగింది. నంది విగ్రహం ప్రాంగణంలో భారతమాతాకి జై అంటూ నినాదా లు చేస్తూ, జాతీయ జెండాలు ప్రదర్శించారు. 


గోరంట్ల: స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీఎం శేఖర్‌ ఆధ్వర్యంలో జాతీయజెండాను ఆవి ష్కరించారు. ప్రతి ఇంటిపైన మూడురోజుల పాటు మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, మేదర శ్రీనివాసులు, ఖగేంద్ర, నజ్రుల్లా, ఆంజినేయులు, శంకర, నరేష్‌ పాల్గొన్నారు.  పా లసముద్రం గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు హెచఎం ఫణికుమార్‌ ఆధ్వర్యంలో  త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని భారీ సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. రెండు వందల అడుగుల జా తీయ జెండా ప్రదర్శించారు. గోరంట్ల ఎస్‌పీవీఎం డిగ్రీ, ఎస్‌కేడీ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు భక్తవత్సలం, విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా జాతీయ జెడాలను ఇళ్లపై ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. 


అగళి: మండలంలోని ఇరిగేపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. హెచఎం హనుమంతరాయప్ప, ఉపాధ్యాయులు కా టప్ప, సత్యనారాయణ, జయలక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T05:48:13+05:30 IST