తిరుమల: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తన తండ్రి ప్రకాష్ పదుకొనే పుట్టినరోజు సందర్భంగా, ఆయనతో పాటు తల్లి ఉజ్జల, సోదరి అనీషాతో కలిసి ఉదయం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.ఆలయం ముందు దీపిక పదుకునేతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.