Sep 15 2021 @ 11:52AM

రూ .22 కోట్లతో బంగ్లా కొనుగోలు చేసిన దీపికా, రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ తాజాగా అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారట. దీని విలువ రూ .22 కోట్లని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న 5 BHK (బెడ్‌రూమ్-హౌస్-కిచెన్) బంగ్లాను ఇటీవలే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ సౌత్ బ్లాక్ బస్టర్ మూవీ 'అపరిచితుడు' హిందీ రీమేక్‌లో నటిస్తుండగా, శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మించనుంది. ఇక దీపిక..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ k' మూవీలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ స్మస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.   

Bollywoodమరిన్ని...