వివాహం తర్వాత కూడా క్రేజీ సినిమాల్లో నటిస్తూ అగ్ర కథానాయికగానే కొనసాగుతోంది దీపికా పదుకొనే. ఒక్కో సినిమాకూ దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అంతటి బిజీలోనూ తన ఇంటికి సంబంధించిన పనులను దీపికానే స్వయంగా పర్యవేక్షిస్తుందట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక వెల్లడించింది.
`నేను మిగతా అందరు మహిళల లాగానే ఉదయాన్నే లేచి ఇంటి పనులు చూస్తాను. ఇంటి సమస్యలు నేనే చూసుకుంటా. ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొంటా. పప్పులు, ఉప్పులు ఆర్డర్ ఇస్తా. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను. ఇప్పుడూ నేను మారలేను. నేను ఇవన్నీ చేయడం చూసి రణ్వీర్ ఆశ్చర్యపోతుంటాడు. `ఇవన్నీ నీకు ఎందుకు?` అంటుంటాడు. కానీ, నాకు ఇలాగే ఇష్టమ`ని దీపిక చెప్పింది.