Shocking: రెఫరీపై దాడి.. ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి దీపక్ పునియా కోచ్ గెంటివేత

ABN , First Publish Date - 2021-08-06T21:05:20+05:30 IST

ఒలింపిక్స్‌లో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. రిఫరీపై దాడి చేసినందుకు గాను భారత రెజ్లర్ దీపక్

Shocking: రెఫరీపై దాడి.. ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి దీపక్ పునియా కోచ్ గెంటివేత

టోక్యో: ఒలింపిక్స్‌లో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. రిఫరీపై దాడి చేసినందుకు గాను భారత రెజ్లర్ దీపక్ పునియా విదేశీ కోచ్ మొరాద్ గైడ్రోవ్‌ను టోక్యో క్రీడా గ్రామం నుంచి గెంటివేశారు. నిన్న జరిగిన కాంస్య పతక పోరు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 86 కేజీల ఫ్రీ స్టైల్ కాంస్య పతక పోరుకు అధికారిగా వ్యవహరించిన రిఫరీ రూములోకి వెళ్లిన దీపక్ కోచ్ ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ పోరులో శాన్ మారినోకు చెందిన మైలెస్ అమైన్ చేతిలో దీపక్ పునియా ఓటమి పాలయ్యాడు.  

Updated Date - 2021-08-06T21:05:20+05:30 IST