ప్చ్‌.. దీపక్‌

ABN , First Publish Date - 2021-08-06T09:27:22+05:30 IST

పురుషుల రెజ్లింగ్‌ 86కేజీల విభాగంలో 19 ఏళ్ల దీపక్‌ పూనియా త్రుటిలో కాంస్యం చేజార్చుకున్నాడు. మొదట ఈ పోరులో 2-1తో ఆధిక్యంలో కొనసాగిన...

ప్చ్‌.. దీపక్‌

పురుషుల రెజ్లింగ్‌ 86కేజీల విభాగంలో 19 ఏళ్ల దీపక్‌ పూనియా త్రుటిలో కాంస్యం చేజార్చుకున్నాడు. మొదట ఈ పోరులో 2-1తో ఆధిక్యంలో కొనసాగిన అతడు చివరి 10 సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా టేక్‌ డౌన్‌ అయ్యాడు. రవి కుడి కాలును గట్టిగా పట్టుకున్న ప్రత్యర్థి మైల్స్‌ అమినే (శాస్‌ మారినో) కింద పడేయడంతో ప్రత్యర్థి రెండు కీలక పాయింట్లు సాధించాడు. దీంతో 2-3 తేడాతో భారత యువ రెజ్లర్‌కు షాక్‌ ఎదురైంది. మరోవైపు అన్షు మాలిక్‌ రెపిచెజ్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని విఫలం చేసుకుంది. రష్యాకు చెందిన కొబొలోవ్‌తో 1-5 తేడాతో పరాజయం పాలైంది.

Updated Date - 2021-08-06T09:27:22+05:30 IST