వారు కూడా డీఎడ్‌ పరీక్షలు రాయొచ్చు

ABN , First Publish Date - 2020-09-20T12:00:36+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20 బ్యాచ్‌ విద్యార్థులకు ఊరట. రెండేళ్ల కోర్సు పూర్తి...

వారు కూడా డీఎడ్‌ పరీక్షలు రాయొచ్చు

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20 బ్యాచ్‌ విద్యార్థులకు ఊరట. రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారందరి అడ్మిషన్లను రాటిఫై చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా విద్యార్థులందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. డీసెట్‌లో క్వాలిఫై కాని వారితో అసలు కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా కన్వీనర్‌ కోటాలో భర్తీకాని సీట్లను, మేనేజ్‌మెంట్‌కోటా సీట్లను నేరుగా భర్తీ చేసుకున్న 188 డీఎడ్‌ కాలేజీలకు ఎన్‌సీటీఈ షోకాజ్‌ నోటీసులు జారీ, ఆపై తనిఖీల  నేపథ్యంలో.. 2018-20 బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల అడ్మిషన్లను రాటిఫై చేయలేదు. 2015లో పాఠశాల విద్యాశాఖ జీవో 30ని ఉల్లంఘించి 2018-20 సంవత్సరానికి కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకోవడంపై అధికారులు సీరియస్‌ అయ్యారు.

Updated Date - 2020-09-20T12:00:36+05:30 IST