Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిప్రెషన్‌ తగ్గించుకోవాలంటే...

డిప్రెషన్‌ బారిన పడేవాళ్లలో ఎక్కువ మంది నిద్రలేమితో బాధపడేవాళ్లే ఉంటారు. ఇది నిజం. మానసిక నిపుణులు చెబుతున్న మాట ఇది. దాదాపు అర్ధరాత్రి సమయంలో భోజనం చేసి.. రాత్రంతా మేల్కొనే వారికి శారీరకంగా సమస్యలు తప్పవంటోంది తాజా పరిశోధన. రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారితో పాటు అర్ధరాత్రి అయినా నిద్రపోని వాళ్లు ఖచ్చితంగా యాంగ్జయిటీ, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతారు. రాత్రిపూట మేల్కొనేవారు మెంటల్‌ డిజార్టర్‌ నుంచి తప్పించుకోలేరు. ఈ విషయాలను అంతర్జాతీయ జర్నల్‌ మాలిక్యులర్‌ సైకియాట్రీలో ప్రచురించారు. 


తెల్లవారుజామున నిద్రలేచి తొమ్మిది నుంచి సాయంత్రం వరకూ పని చేసుకుని త్వరగా నిద్రపోయేవారికి మానసిక సమస్యలుండవంటున్నారు పరిశోధకులు. సాధారణంగా పగలు పనిచేసేవారు, రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారిని దాదాపు 85 వేల మంది డేటాని ఓ డేటా బ్యాంకు ద్వారా తీసుకుని విశ్లేషించారు. ఈ డేటా వారు వాడిన స్మార్ట్‌ వాచ్‌లది. ఇందులో పగలు చేసే పనిని రాత్రి చేసే వారిలోనే ఎక్కువగా యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లక్షణాలు కనిపించాయి. మొత్తానికి కాలానికి వ్యతిరేకంగా పోకుండా.. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేయాలనే పెద్దలమాట కరెక్ట్‌ అని పరిశోధన ద్వారా వెల్లడయింది. 


Advertisement
Advertisement