Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 9 2021 @ 11:55AM

Delhi: ఫ్లాట్‌లో మాజీ ఎమ్మెల్సీ మృతదేహం లభ్యం

ఢిల్లీ:  జమ్మూ కశ్మీర్ శాసనమండలి మాజీ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు త్రిలోచన్ సింగ్ వజీర్ (67)మృతదేహాన్ని పశ్చిమ ఢిల్లీలోని ఒక ఫ్లాట్‌లో గురువారం పోలీసులు కనుగొన్నారు.ఈ ఘటనతో వజీర్ కుటుంబసభ్యులు జమ్మూ నుంచి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లారు. వజీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అతని మృతికి గల కారణాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 67 ఏళ్ల త్రిలోచన్ సింగ్ వజీర్ కుళ్లిపోయిన మృతదేహం పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో లభ్యమైందని పశ్చిమ ఢిల్లీ డీసీపీ ఉర్విజ గోయల్ చెప్పారు. వజీర్ ఇటీవల జమ్మూలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు. 

తమపార్టీ నేత వజీర్ ఆకస్మిక మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వజీర్‌ను కొద్దిరోజుల క్రితమే నేను జమ్మూలో కలిశాను. అదే చివరిసారి అనుకోలేదు, ఆయన మృతి వార్త తెలిసి నేను షాక్ కు గురయ్యాను, వజీర్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement