ప్రాక్టీస్‌ ప్యాంటుతోనే ఆడాడు

ABN , First Publish Date - 2020-10-18T09:16:09+05:30 IST

కోల్‌కతాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకంతో కదం తొక్కిన ముంబై కీపర్‌ డికాక్‌ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అతడి బ్యాటింగ్‌తో జట్టంతా

ప్రాక్టీస్‌ ప్యాంటుతోనే ఆడాడు

అబుదాబి: కోల్‌కతాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకంతో కదం తొక్కిన ముంబై కీపర్‌ డికాక్‌ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అతడి బ్యాటింగ్‌తో జట్టంతా మురిసినా..కోచ్‌ జయవర్ధనే ఒక విషయంలో అసంతృప్తి వ్యక్తంజేశాడు. అదేమిటంటే..డికాక్‌ ప్రాక్టీస్‌ ప్యాంటు ధరించి మ్యాచ్‌ బరిలోకి దిగడం. ఆ ప్యాంటుపై నారింజ రంగు గీతలు ఉండడంతో అవి కనపడకుండా మ్యాచ్‌ ఆసాంతం పలుమార్లు డికాక్‌ తన జెర్సీని కిందకు అనుకోవడం కనిపించింది. ‘ప్రాక్టీస్‌ ప్యాంటు వేసుకొని ఆడడం మినహా డికాక్‌ బ్యాటింగ్‌ అదిరింది. కానీ ఈసారి ఆ ప్యాంటుతో బరిలోకి దిగకు. ఎందుకంటే ఆ ప్యాంటుతో ఆడితే జట్టు మార్కెటింగ్‌ విభాగం ఒప్పుకోదు’ డికాక్‌తో మహేల అన్నాడు. 

Updated Date - 2020-10-18T09:16:09+05:30 IST