వరినారుమళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-07-05T10:29:49+05:30 IST

వైరా ప్రాజెక్టు పరిధిలో వరి నారుమళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 8నుంచి వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో వానాకాలం

వరినారుమళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

8న రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదలకు నిర్ణయం


వైరా, జూలై 4: వైరా ప్రాజెక్టు పరిధిలో వరి నారుమళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 8నుంచి వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో వానాకాలం సాగుకుగానూ వరినారుమళ్లు పోసుకొనేందుకు ఎమ్మెల్యే రాములునాయక్‌ పచ్చజెండా ఊపారు. ఆమేరకు నీటిపారుదలశాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతుసంఘాల ప్రతినిధులు, ఆయకట్టు రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరినారుమళ్లకు నీళ్లు విడుదల చేయాలని నిర్ణయించారు. వారంరోజులపాటు వరినారుమళ్లకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయించారు.


కార్యక్ర మంలో మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, నీటిపారుదలశాఖ ఖమ్మం ఈఈ నర్సింహారావు, వైరా డీఈఈ పి.శ్రీనివాస్‌, ఏఈఈ డి.రాణి, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.హేమంతకుమార్‌, వ్యవసాయశాఖ ఏడీ వి.బాబూరావు, ఏవో ఎస్‌.పవన్‌కుమార్‌, వైరా ఎంపీపీ పావని, జడ్పీటీసీ కనకదుర్గ, రైతుబంధు మండల కన్వీనర్‌ నాగకోటేశ్వరరావు, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ జైపాల్‌, సీతరాములు, ఏఎంసీ చైర్మన్‌ రోశయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:29:49+05:30 IST