14 తర్వాతే ‘విద్యాసంస్థల’పై నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-06T07:11:36+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల...

14 తర్వాతే ‘విద్యాసంస్థల’పై నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. ఆయన ఆదివారక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ ఉందని, అది ముగిసిన తర్వాతే విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 14 తర్వాత కూడా విద్యా సంస్థలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.   


Updated Date - 2020-04-06T07:11:36+05:30 IST