కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం 2021 హజ్ యాత్రపై తుది నిర్ణయం

ABN , First Publish Date - 2020-10-20T12:38:11+05:30 IST

2021 జులైలో హజ్ యాత్రపై సౌదీఅరేబియా ప్రభుత్వ పిలుపు, జాతీయ, అంతర్జాతీయ కొవిడ్-19 మార్గదర్శకాలపై ఆధారపడి తుది నిర్ణయం తీసుకుంటామని ...

కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం 2021 హజ్ యాత్రపై తుది నిర్ణయం

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ : 2021 జులైలో హజ్ యాత్రపై సౌదీఅరేబియా ప్రభుత్వ పిలుపు, జాతీయ, అంతర్జాతీయ కొవిడ్-19 మార్గదర్శకాలపై ఆధారపడి తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. 2021 హజ్ యాత్ర ఏర్పాట్లపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో హజ్ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హజ్ యాత్ర మార్గదర్శకాల్లో గణనీయమైన మార్పులు చేస్తామని మంత్రి చెప్పారు. 


సౌదీఅరేబియాలో వసతి, రవాణా, ఆరోగ్యం, ఇతర సౌకర్యాల కల్పనపై ఆధారపడి హజ్ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రకు యాత్రికులను పంపలేదు. 2.3 లక్షలకు పైగా హజ్ యాత్రికుల నుంచి సేకరించిన డబ్బును తగ్గింపు లేకుండా ప్రత్యక్ష బదిలీ చేస్తామని నఖ్వీ ప్రకటించారు. 

Updated Date - 2020-10-20T12:38:11+05:30 IST