ట్విట్టర్ బ్లాక్ చేయడంపై.. రష్యా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-05-18T04:02:54+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను రష్యాలో బ్యాన్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్లో పెట్టే కొన్ని పోస్టుల్లో కొన్ని చట్టవ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్న రష్యన్ కమ్యూనికేషన్స్ నియంత్రణా సంస్థ..

ట్విట్టర్ బ్లాక్ చేయడంపై.. రష్యా కీలక ప్రకటన

మాస్కో: ప్రపంచ ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను రష్యాలో బ్యాన్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్లో పెట్టే కొన్ని పోస్టుల్లో కొన్ని చట్టవ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్న రష్యన్ కమ్యూనికేషన్స్ నియంత్రణా సంస్థ.. ఈ విషయంలో ట్విట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కొన్ని నిబంధనలు విధించి, అవి పాటిస్తే బ్లాక్ చేసే అవసరం ఉండదంటూ ఒక జాబితాను ట్విట్టర్ సంస్థకు పంపించింది. సదరు జాబితాలోని 91శాతం నిబంధనలకు ట్విట్టర్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో ట్విట్టర్‌ను బ్లాక్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఫేస్‌బుక్, యూట్యూబుల్లో కూడా చట్టవ్యతిరేక పోస్టులు కనిపిస్తున్నాయని, వీటిపై కూడా త్వరలోనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2021-05-18T04:02:54+05:30 IST