డిసెంబర్‌లోగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు

ABN , First Publish Date - 2021-11-06T12:54:13+05:30 IST

అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ ఎన్నికలను డిసెంబర్‌లోగా నిర్వహించనున్నా మని, అందుకు సంబంధించి ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం,

డిసెంబర్‌లోగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు

                                    - ఈపీఎస్‌, ఓపీఎస్‌ ప్రకటన

 

చెన్నై(Tamilnadu): అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ ఎన్నికలను డిసెంబర్‌లోగా నిర్వహించనున్నా మని, అందుకు సంబంధించి ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళని స్వామి సంయుక్తంగా ప్రకటించారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ప్రతి ఐదేళ్లకొకమారు నిర్వహించాల్సి ఉంది. 2014లో మాజీ ముఖ్యమంత్రి జయ లలిత పార్టీ సంస్థాగత ఎన్నికలను చివరిసారిగా నిర్వహించారు. ఆ తర్వాత 2019లో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు రావడంతో గత రెండేళ్లుగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించలేకపోయారు. ఆ నేపథ్యంలో అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ అన్నాడీఎంకే ప్రముఖుడొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ యేడాది డిసెంబర్‌ లోగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రకియను పూర్తి చేయాలని ఆదేశిం చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఎన్నికలను డిసెంబర్‌లోగా జరిపేందుకు అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం చర్యలు చేపడుతున్నారు. ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వ్యవహారంలో రాష్ట్ర హక్కులను స్థిరీకరించేలాని ఈ నెల తొమ్మిదిన దర్నాలు, రాస్తారోకో నిర్వ హించనున్నారు. ఈ ఆందోళన తర్వాత పార్టీ నాయకులు ఎడప్పాడి పళని స్వామి, పన్నీర్‌సెల్వం సమావేశమై సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లపై అధికారిక ప్రకటన జారీ చేయనున్నారని పార్టీ సీనియర్‌ నేత తెలిపారు. ప్రస్తుత మున్న పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త, డిప్యూటీ సమన్వయకర్త పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీలో చేర్చుకునే విషయమై ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మధ్య ఏర్పడిన మనస్పర్థలను తొలగిం చేందుకు సీనియర్లు ప్రయత్నించనున్నారు. ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత పార్టీ సర్వసభ్యమండలి సమావేశం, కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరుగనున్నాయి. 

Updated Date - 2021-11-06T12:54:13+05:30 IST