రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-29T03:39:10+05:30 IST

ప్రభుత్వం అందించే రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవా లని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. గురు వారం మండల పరిషత్‌ కార్యాలయంలో 2018-19సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ రుణాలను ఆమె లబ్ధిదారులకు అంద జేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణాలతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాల న్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 28: ప్రభుత్వం అందించే రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవా లని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. గురు వారం మండల పరిషత్‌ కార్యాలయంలో 2018-19సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ రుణాలను ఆమె లబ్ధిదారులకు అంద జేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణాలతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాల న్నారు. జిల్లాలో 172మందికి రుణాలు మంజూరు కాగా 144 మందికి చెక్కులు వచ్చాయని, మిగతా వారికి త్వర లోనే వస్తాయని ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్‌ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ అరి గెల మల్లిఖార్జున్‌, సింగిల్‌విండో చైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, జైనూర్‌ మార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఆత్రంభగవంత్‌రావు పాల్గొన్నారు.

మాలీ సంక్షేమ భవన నిర్మాణానికి కృషి..

వాంకిడి: మాలీ సంక్షేమసంఘం భవన నిర్మాణా నికి కృషి చేస్తానని జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి హామీ ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలో జ్యోతిబా ఫూలే విగ్రహప్రతిష్టాపన కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో మాలీసంక్షేమ సంఘం నూతన భవణ నిర్మాణానికి రూ.25లక్షలు, ప్రహరీ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌ కుమార్‌, సీఏసీఎస్‌ చెర్మన్‌ జాబిరే పెంటు, వాంకిడి, బంబార, సరండి సర్పంచులు బండె తుకారాం, సయ్యద్‌అయ్యూబ్‌, దుర్గంకమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T03:39:10+05:30 IST