అప్పులబాధ తాళలేక యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-16T05:42:17+05:30 IST

అప్పులబాధ తాళలేక గురువారం పలాసకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పులబాధ తాళలేక యువకుడి ఆత్మహత్య


పలాస:అప్పులబాధ తాళలేక గురువారం పలాసకు చెందిన  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ శిరీష కథనం మేరకు... పలాసలోని చాకలి వీధికి చెందిన రమణ  (45)అప్పుచేసి బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడని నిలదీసిన భార్యతో తగాదాకు దిగాడు. దీంతో మనస్థాపంతో కంబిరిగాం రోడ్డు చాకలిచెరువు వద్ద ఉన్న చెట్టుకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమణకు  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.





Updated Date - 2021-01-16T05:42:17+05:30 IST