కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ

ABN , First Publish Date - 2022-05-25T06:26:42+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకిరాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీని ఏకమొత్తంలో చేస్తామని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ
రచ్చబండలో మాట్లాడుతున్న బాలునాయక్‌

చింతపల్లి, మే 24: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకిరాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీని ఏకమొత్తంలో చేస్తామని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. మండలంలోని పోలేపల్లి రాంనగర్‌, గొడుకొండ్ల, పాలెంతండా, చాకలిశేరిపల్లి, తక్కెళ్లపల్లి, రోటిగడ్డతండా గ్రామాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. పేద ప్రజలు, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంగిరేకుల గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆదివాసి జాతీయ కోఆర్డీనేటర్‌ నేనావత్‌ కిషన్‌నాయక్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎంఎ.సిరాజ్‌ఖాన్‌, దొంతం సంజీవరెడ్డి, గుండ్లపల్లి నర్సింహా రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానిపవన్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగంపల్లి వెంకటయ్య, దాసరి శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.

నకిరేకల్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రైతులకు సరైన న్యాయం జరుగుతుందని టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దైద రవీందర్‌ అన్నారు. మండలంలోని నెల్లిబండలో రైతులతో జరిగిన రచ్చబండలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బోయిళ్ల కిషోర్‌, కొండ శంకర్‌గౌడ్‌, మద్ది నాగిరెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సింహ్మ, శంకర్‌ ఉన్నారు.

Updated Date - 2022-05-25T06:26:42+05:30 IST