Abn logo
Oct 19 2020 @ 01:40AM

నష్టపోయిన రైతులకు రుణ మాఫీ చేయాలి

ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ

చల్లపల్లి/అమరావతి/తాడేపల్లి, అక్టోబరు 18: ‘‘వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి. తక్షణమే పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం విడుదల చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 


కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ, వెలివోలు తదితర గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదివారం పరామర్శించారు. కాగా,  ముఖ్యమంత్రి జగన్‌ న్యాయమూర్తులపై సీజేకు లేఖ రాయడం ముమ్మాటికి న్యాయవ్యవస్థపై దాడేనని  రామకృష్ణ  ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో వ్యాఖ్యానించారు.

అలాగే.. పట్టణ, నగరపాలక సంస్థలకు ప్రభుత్వ ఆదాయంలో వాటా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు  సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు.    


Advertisement
Advertisement
Advertisement